Biodata Maker
✕

వేధించే దగ్గుకి, స్థూలకాయం తగ్గడానికి ఇది చాలు...

Written By సిహెచ్
Updated: బుధవారం, 8 జులై 2020 (22:17 IST)
ఆరోగ్య సమస్యలు అందరికీ వస్తూనే వుంటాయి. సహజమైన సమస్యల్లో దగ్గు ఒకటి. ఈ సమస్య కొందరికీ ఎంతకీ తగ్గదు. అలాంటివారు జీలకర్ర పొడి 10 గ్రాములు, ఉప్పు పావు టీ స్పూన్, మిరియాల పొడి స్పూన్ కలిపి ఉంచుకుని రెండుపూటలా పూటకు ఒకట్రెండు గ్రాముల చూర్ణము చప్పరించి మింగుతుండాలి. అంతే మొండిదగ్గు మటుమాయం అవుతుంది.
 
కొందరు స్థూలకాయంతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు రోజుకు ఉదయం 200 మిల్లీ లీటర్ల నీటిలో 5 గ్రాముల జీలకర్ర వేసి కొద్దిసేపు నాననిచ్చి, మరిగించి, దించి గోరువెచ్చగా వున్నప్పుడు వడగట్టి అరబద్ద నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే శరీరంలో అధికంగా సంచితమైన కొవ్వు కరిగి అధికబరువు లేదా స్థూలకాయ సమస్య తగ్గుతుంది.
 
అలాగే జీలకర్ర పొడి, కరక్కాయ పెచ్చుల పొడి, ఉప్పు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజుకు ఒకట్రెండుసార్లు దంతధావనచూర్ణంగా వాడుకుంటుంటే చిగుళ్లవాపు, నొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కారడం, పంటి నొప్పులు తగ్గుతాయి.

అన్నీ చూడండి

ఆరోగ్య శాఖలో కలకలం - నకలీ డెత్ సర్టిఫికేట్లతో కారుణ్య ఉద్యోగాలు

బంజారా హిల్స్‌లో పట్టపగలు దారుణ హత్య.. వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు... (వీడియో)

ఉద్యోగులకు దీపావళి కానుక : నగదు కట్టలు! (వీడియో)

సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సివస్తుందని బయటకు గెంటేసిన కేటీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

అన్నీ చూడండి

థియేటర్లలో 'రామాయణ' మూవీ వీడియోలు తీస్తున్నారా.. అయితే జైలుకే

దక్షిణాది చిత్రాల్లో చేదు అనుభవాలున్నాయ్ : రాధికా ఆప్టే

'వెంకటలక్ష్మి రావే’… ప్రేమకు పదాల పట్టాభిషేకం

Anushka Shetty Birth Day: అనుష్క శెట్టి 45వ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

Naga Chaitanya: వృషకర్మ నుంచి స్వాగ్ అటిట్యూడ్‌తో ‘స్వాగ్ ఆఫ్ అర్జున్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments