ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (09:24 IST)

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే గోరు వెచ్చని నిమ్మరసం తాగితే....

ప్రకృతి ప్రసాదించిన ఎన్నో సహజవనరులు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కూరగాయలు, పండ్లు ముఖ్యమైనవి. ఇలాంటి సహజవనరుల్లో నిమ్మకాయ ఒకటి. ఇది ఆరోగ్య ప్రదాయని. నిమ్మ అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే దివ్యౌషధం.

ప్రకృతి ప్రసాదించిన ఎన్నో సహజవనరులు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కూరగాయలు, పండ్లు ముఖ్యమైనవి. ఇలాంటి సహజవనరుల్లో నిమ్మకాయ ఒకటి. ఇది ఆరోగ్య ప్రదాయని. నిమ్మ అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే దివ్యౌషధం. ముఖ్యంగా... జీర్ణ సమస్యలను తగ్గించడంలో నిమ్మకు మించింది మరొకటి లేదని చెప్పొచ్చు. శరీరంలోని లవణ శాతాన్ని పెంచి, వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో నిమ్మ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. అందుకే ఎండాకాలంలో నిమ్మరసం తాగడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. 
 
నిమ్మరసాన్ని రోజూ నిద్ర లేవగానే ఉదయం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 2 కప్పుల నీటిని వేడి చేయాలి. ఆ వేడి నీరు గోరువెచ్చగా ఉండగా 4 అల్లం ముక్కలు నీటిలో వేయాలి. వాటితో పాటు ఒక నిమ్మకాయను అందులో పిండుకోవాలి. కొంత పెప్పర్, ఒక టీ స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని కలగలిపి సేవించడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇలాచేయడం వల్ల శరీరంలో ఉండే నీటి శాతం పెరిగుతుంది. చర్మానికి మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీనివల్ల వ్యాధికారక క్రీముల తాకిడికి చర్మం తట్టుకుంటుంది.