శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2017 (12:34 IST)

కేకులు, బిస్కెట్లు తెగ లాగిస్తున్నారా? ఐతే మెమరీ లాస్ తప్పదండోయ్..

కేకులు, బిస్కెట్లు తెగ లాగిస్తున్నారా? పిల్లలకు స్నాక్స్ బాక్స్‌ను వాటితో నింపేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. బిస్కెట్లు, కేకులను అదేపనిగా తింటే మెమొరీ దెబ్బతినే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్

కేకులు, బిస్కెట్లు తెగ లాగిస్తున్నారా? పిల్లలకు స్నాక్స్ బాక్స్‌ను వాటితో నింపేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. బిస్కెట్లు, కేకులను అదేపనిగా తింటే మెమొరీ దెబ్బతినే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిస్కెట్లు.. కేకుల ప్రాసెసింగ్ సమయంలో బిస్కెట్లు కరకరలాడేందుకు, కేకులకు మంచి ప్లేవర్‌ రావడానికి వాడే ట్రాన్స్ ఫ్యాట్స్ అనే కొన్నిరకాల కొవ్వు పదార్థాలేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇదేకాకుండా బిస్కెట్లు, కేకుల తయారీ కోసం ఉపయోగించే నూనెలు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని సైంటిస్టులు తేల్చారు. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే బిస్కెట్లు, కేకులు ఎక్కువగా తినేవారిలో మెమొరీ పవర్ తగ్గిపోయే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇంకా మరికొంతమందిలో అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు కూడా బయటపడినట్లు పరిశోధకులు తెలిపారు.