సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 డిశెంబరు 2023 (15:01 IST)

అత్తి పండ్లతో కలిపి సోంపు గింజలు తింటే ఏమవుతుంది?

Fennel seeds
సోంపు గింజలు. వీటిని తరచుగా మనం భోజనం చేసాక నోట్లో వేసుకుని నములుతుంటాం. ఈ సోంపు గింజలు తింటే ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. అత్తి పండ్లతో సోంపును కలిపి తింటే దగ్గు, బ్రాంకైటిస్ దూరమవుతాయి. తిమ్మిర్లు, నొప్పి, గ్యాస్ట్రిక్ రుగ్మతలు వంటి కడుపు సంబంధ సమస్యలకు ఇది చాలా ప్రభావవంతమైన ఔషధం.
 
ఇది తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు, కాబట్టి భోజనం చేసాక 30 నిమిషాల తర్వాత ఒక చెంచా సోంపు తినవచ్చు. రుతుక్రమం సక్రమంగా ఉండేందుకు సోంపు తినడం మేలు చేస్తుంది. బెల్లం కలిపి తింటే మంచిది. పసిబిడ్డలకు కడుపు నొప్పి తొలగించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
 
రోజూ 5-6 గ్రాముల సోంపును తీసుకోవడం వల్ల కాలేయం, కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది. సోంపును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వేయించిన సోంపును పంచదార మిఠాయితో కలిపి తింటే కఫం, దగ్గును దూరం చేస్తుంది. ఉబ్బసం చికిత్సలో సోంపు అద్భుతంగా పనిచేస్తుంది.