శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (13:15 IST)

సోంపును వాడితే.. కొవ్వును కరిగించుకోవచ్చు..

బిర్యానీ చేస్తే, ఏదైనా మాంసాహారం చేస్తే.. లేదంటే వెజ్ కుర్మా చేసినా సోంపు గింజల్ని వాడుతుంటాం. ఆ సోంపు గింజలు ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందని తెలుసుకుందాం. సోంపు శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్

బిర్యానీ చేస్తే, ఏదైనా మాంసాహారం చేస్తే.. లేదంటే వెజ్ కుర్మా చేసినా సోంపు గింజల్ని వాడుతుంటాం. ఆ సోంపు గింజలు ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందని తెలుసుకుందాం. సోంపు శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కంటికి కీడు చేసే రక్తపోటును దూరం చేస్తుంది.

శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. రోజు పావు స్పూన్ మేర ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా హృద్రోగాల నుంచి తప్పించుకోవచ్చు. ఉదర సంబంధిత వ్యాధులను నియంత్రించుకోవచ్చు. కంటికి ఎంతో మేలు చేస్తుంది. చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. సోంపును ఉపయోగించి రక్తపోటు, కొవ్వును కరిగించుకోవచ్చు. 
 
సోంపు పొడి అర టీ స్పూన్, పావు స్పూన్ పసుపు పొడి ఈ మూడింటిని ఒక గ్లాసుడు నీటిలో మరిగించాలి. ఆపై ఆ నీటిని వడగట్టి.. తేనె కలుపుకుని తీసుకుంటే.. ఒబిసిటీ దూరమవుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. రక్తపోటు తగ్గుతుంది. రక్తనాళాల్లో కొవ్వు చేరడాన్ని నిరోధిస్తుంది.

అలాగే ఒక స్పూన్ త్రిఫల చూర్ణం, అరస్పూన్ సోంపు పొడి తీసుకుని ఒక గ్లాసు నీటిలో మరిగించాలి. దీన్ని వడగట్టి సేవిస్తే రక్తపోటు తగ్గుతుంది. కంటిదృష్టికి మేలు చేస్తుంది. సోంపు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.