ఇవి పాటిస్తే పోయేదేంలేదు డ్యూడ్... ఆరోగ్యవంతులవుతారంతే...
ఈమధ్య వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే రోగాలు తగులుకుంటున్నాయి. అలాంటి వాటిని దరి చేయకుండా ఉండాలంటే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఉదయాన్నే నిద్ర లేవగానే చాలామంది ఏ కాఫీనో, టీనో తాగేసి టిఫిన్
ఈమధ్య వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే రోగాలు తగులుకుంటున్నాయి. అలాంటి వాటిని దరి చేరకుండా ఉండాలంటే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఉదయాన్నే నిద్ర లేవగానే చాలామంది ఏ కాఫీనో, టీనో తాగేసి టిఫిన్ చేసేసి చేతులు కడిగేసుకుని ఆఫీసుకు పరుగెడతారు. ఐతే ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోముకుని పరగడపును ఓ చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమలండి. శ్లేష్మం, కఫం దెబ్బకు పారిపోతాయి.
అంతేకాదు, రాత్రి పూట అన్నం తిన్నతర్వాత తాంబూలం వేసుకోండి, తిన్న అన్నం చక్కగా జీర్ణమవుతుంది. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ధనియాలు నమలండి. జీర్ణాశయానికి మంచిది. ఇవన్నీ తింటుంటే మధుమేహం రాదు. శీతాకాలం వచ్చిందంటే చాలామందికి గొంతు సమస్య ఎదురవుతుంది. గరగరలాడుతుంది. ఎంతో ఇబ్బంది పెడుతుంది. మరేంలేదు.. ఓ చిన్న లంవంగం తీసుకుని చిన్నచిన్నగా కొరుకుతూ ఉండండి. గొంతు గరగర వదులుతుంది.
స్థూలకాయం, ఊబకాయం, అధిక బరువు అనుకుంటూ ఉదయాన్నే బూట్లు వేసుకుని చాలామంది నడవాలని టైం టేబుల్ వేసుకుని వెళుతుంటారు. అంతదాకా ఎందుకు? ఇంట్లోనే సాధ్యమైనన్ని సార్లు నేల మీదు కూర్చుని లేస్తూ ఉండండి. కొవ్వు ఎలా కరిగిపోదూ చూడండి. అంతేతప్ప ఏదో షెడ్యూల్ వేసుకుని నడవాలి, పరుగెత్తాలి అనుకుంటూ ఆ షెడ్యూల్ మిస్ చేసుకుని అనారోగ్యాన్ని తెచ్చుకోవద్దు. అన్నీ ఇంట్లోనే దొరుకుతాయ్.. ఇంట్లోనే పని చేస్తే కొవ్వు దాని దారి అది వెతుక్కుంటుంది.