1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 20 మే 2016 (19:31 IST)

మిరియాలను నేతిలో వేయించుకుని పొడిచేసి తీసుకుంటే ఫలితం ఏమిటి..?

నేతితో మిరియాలను వేయించుకుని పొడి చేసుకుని తింటే గొంతు బాధలు తగ్గుతాయి. తీవ్రమైన జలుబుకు, దగ్గుకు మిరియాల చారుకి మించిన గొప్ప వైద్యం లేదు. గొంతు నొప్పికి మిరియాల వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతో పాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడి చేసుకుని తీసుకుంటే గొ

నేతితో మిరియాలను వేయించుకుని పొడి చేసుకుని తింటే గొంతు బాధలు తగ్గుతాయి. తీవ్రమైన జలుబుకు, దగ్గుకు మిరియాల చారుకి మించిన గొప్ప వైద్యం లేదు. గొంతు నొప్పికి మిరియాల వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతో పాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడి చేసుకుని తీసుకుంటే గొంతులో వచ్చే బాధ తగ్గిపోతుంది.
 
మిరియాలు, వెల్లుల్లిని నీటిలో వేసి బాగా ఉడికించుకుని ఆ నీటిలో తేనె కలుపుకుని, అప్పుడప్పుడు తాగుతుంటే వేడి తగ్గుతుంది. అజీర్ణ వ్యాధితో బాధపడేవారికి కూడా మిరియాలు ఎంతో మేలు చేస్తాయి. మూత సంబంధ వ్యాధులు గలవారికి మిరియాలు గొప్ప ఔషధం. 
 
తినే పదార్థాలపై మిరియాల పొడిని చల్లుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యము కలుగుతుంది. మతిభ్రమ, మూర్చ, హిస్టీరియా లాంటి వ్యాధులు వున్నవారు మిరియాల ఘాటును పీల్చితే ఎంతో మంచిది. మిరియాల పొడి, ఉప్పు పొడి సమంగా కలిపి, ఆ పొడిని కొండ నాలుకకు బాగా అద్దుకుంటే  కొండనాలుక తగ్గి, విపరీతంగా వచ్చే దగ్గు నివారణ అవుతుంది.