గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 4 జనవరి 2017 (22:29 IST)

జలుబు, తలనొప్పి, బీపి, ఒత్తిడి, ఎసిడిటీకి చిట్కాలు

* జలుబు, దగ్గుతో బాధపడేవారు ఇంట్లోనే టర్మరిక్ టానిక్ తయారుచేసుకోవచ్చు. 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెను తీసుకొని ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి, ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. * రోజూ మూడుప

* జలుబు, దగ్గుతో బాధపడేవారు ఇంట్లోనే టర్మరిక్ టానిక్ తయారుచేసుకోవచ్చు. 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెను తీసుకొని ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి, ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* రోజూ మూడుపూటలా నాలుగుచొప్పున ఎండు ద్రాక్షను తింటే రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది.
* రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు మంచినీరు తాగడం వల్ల గుండెపోటు రాకుండా ఉంటుంది. అలాగే స్నానం చేసే ముందు గ్లాసు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది.
*డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నిమ్మకాయను ముక్కు దగ్గరకు పెట్టుకొని వాసన చూడాలి. అలా చేస్తే స్ట్రెస్ తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
* బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు... గోరువెచ్చని నీటితో ఒక ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్‌ను వేసుకోవాలి. దాంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.
* వేడి నీళ్లలో 1 టీ స్పూన్ సోంపును వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి, ఆందులో టీ స్పూన్ తేనెను కలిపి మూడుపూటలా తీసుకుంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.