సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (16:07 IST)

వేసవి తాపాన్ని తట్టుకోవడం ఎలా? నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అంతే...

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు వార్తలు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటికాలంలో మరింత జాగ్రత్తతో ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి. ఈ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు వ్యక్తిగతంగా చిన్నపాటి చిట్కాలు పాటిస్తేచాలు.. 
 
వేసవికాలంలో ఎక్కువగా పగటి పూట తిరగకుండా ఉండటం మంచిది. ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే సన్‌స్క్రీన్, టోపి, సన్‌గ్లాసెస్, గొడుగులు వంటివి ఉపయోగించాలి. 
 
వేసవికాలంలో తగినంత నిద్రపోవాలి. వేసవిలో నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. వీలైనంత ఎక్కువగా పండ్ల రసాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీరసం రాదు. అంతేగాకుండా శరీరంలోని నరాలు.. ఎముకలు బలంగా ఉంటాయి.
 
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం 20 నిమిషాలైనా వ్యాయామం లేదా వాకింగ్ చేయడం ఉత్తమం. తాజా ఆహారాన్నే తీసుకోవాలి. నిల్వ చేసిన ఆరోగ్యాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.