1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 10 జూన్ 2017 (18:40 IST)

కలబందతో బరువును తగ్గించవచ్చు... ఎలాగంటే?

అధిక బరువుతో బాధపడే వారు కలబంద రసాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకొంటే శరీర అవయవాల చుట్టు ఉండే కొవ్యు పదార్థాలను కలబందలో ఉండే పైటోస్టెరోల్స్ విసిరల్ ఫ్యాట్స్ వంటివి కొవ్వును పూర్తిగా తగ్గించి వేస్తాయి. ఒక చెంచా కలబంద రసంను, ఒక చెంచా అల్లం రసంను

అధిక బరువుతో బాధపడే వారు కలబంద రసాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకొంటే శరీర అవయవాల చుట్టు ఉండే కొవ్యు పదార్థాలను కలబందలో ఉండే పైటోస్టెరోల్స్ విసిరల్ ఫ్యాట్స్ వంటివి కొవ్వును పూర్తిగా తగ్గించి వేస్తాయి. 
 
ఒక చెంచా కలబంద రసంను, ఒక చెంచా అల్లం రసంను, ఒక కప్పు వేడి నీటిలో కలిపి తక్కువ మంట పైన వేడి చేయాలి. ఇలా తయారుచేసిన మిశ్రమం బరువును తగ్గించటంలో అద్భుతంగా పని చేస్తుంది. ఈ మిశ్రమం త్రాగటం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. 
 
జుట్టు రాలడం, చిట్లడం వలన జుట్టు పెరగటం ఆగి పోతుంది. ఈ సమస్యను నివారించేందుకు కలబంద పేస్టును 15 రోజులకు ఒకసారి తలకు పెట్టుకుంటే అరికట్టవచ్చు. 
 
కొత్తిమీరతో మతిమరుపుకు చెక్
 
ప్రతి రోజ మనం వండే కూరలలో చక్కని సువాసన, కమ్మని రుచి కోసం కొత్తిమీర వాడతం. కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్తిమీరలో విటవిన్ సి,కె లతో పాటు ఇనుము, మాంగనీస్, ప్రోటీన్లూ కూడ ఎక్కువే. దీన్ని ఎక్కువగా కూరలలో ఉపయోగించడం వలన శరీరంలో హాని చేసే కొవ్వు తగ్గుతుంది. జీర్ణ వ్యవస్ధ పనితీరు మెరుగుపడుతుంది.
 
రక్తంలోని చక్కెర నిల్వల్ని సమన్వయపరుస్తుంది. కొత్తిమీరలో అధికంగా లభించే విటమిన్ కె వయస్సు మళ్ళిన తరువాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రిస్తుంది. కొత్తిమీరను వాడటం వలన కీళ్ళనొప్పులు, నోటి పూతను తగ్గిస్తుంది. అంతేకాదు నెలసరితో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది.