ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 22 జూన్ 2016 (22:01 IST)

వాతావరణం మారుతోంది... తేనెను తెచ్చుకోండి... ఎందుకంటారా...?

వాతావరణం మారింది. జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు, బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఈ కాలంలో ఎక్కువ‌గా వ్యాపిస్తాయి. అయితే వీట‌న్నింటికీ తేనెతో చెక్ పెట్టవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ

వాతావరణం మారింది. జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు, బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఈ కాలంలో ఎక్కువ‌గా వ్యాపిస్తాయి. అయితే వీట‌న్నింటికీ తేనెతో చెక్ పెట్టవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
1. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సంల‌ను తీసుకుని ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో బాగా క‌ల‌పాలి. ఈ ద్ర‌వాన్ని నెమ్మ‌దిగా తాగాలి. దీని వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ఈ మిశ్ర‌మంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మ‌వుతాయి. 
 
2. నిత్యం ఏదో ఒక రూపంలో ఒక టీస్పూన్ తేనెను తీసుకుంటూ ఉంటే ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా క‌లిగే పొట్ట ఇన్‌ఫెక్ష‌న్లు, ఫుడ్ పాయిజ‌నింగ్ వంటి స‌మ‌స్య‌ల నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు. 
 
3. ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ అల్లం రసం, కొద్దిగా నిమ్మ‌ర‌సంల‌ను తీసుకుని మూడింటినీ బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ కాలంలో వ‌చ్చే వ్యాధుల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు కూడా దూర‌మ‌వుతాయి. 
 
4. తేనెలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు అధికంగా ఉన్నాయి. అందువ‌ల్ల తేనె ప‌లు ర‌కాల బాక్టీరియాల‌కు, వైరస్‌ల‌కు, సూక్ష్మ క్రిముల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. వాటిని నిర్మూలిస్తుంది. అందుకే తేనెను ఈ కాలంలో కచ్చితంగా తీసుకోవాలి. దీని వ‌ల్ల మ‌నం ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.