Daily Horoscope
✕

ఎలాంటి ఆహార పదార్థాలను కొనాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మనం తీసుకునే ఆహారం ఎంత పుష్టికరమైనదైనా శుభ్రత లోపిస్తే ఆరోగ్యం దెబ్బతిని రోగాలకు గురి అవుతాము. మనం తినే ఆహారం, త్రాగే నీరు సూక్ష్మక్రిముల వల్ల కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అలాకాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

Written By chj
Updated: శనివారం, 15 సెప్టెంబరు 2018 (14:55 IST)
మనం తీసుకునే ఆహారం ఎంత పుష్టికరమైనదైనా శుభ్రత లోపిస్తే ఆరోగ్యం దెబ్బతిని రోగాలకు గురి అవుతాము. మనం తినే ఆహారం, త్రాగే నీరు సూక్ష్మక్రిముల వల్ల కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అలాకాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
 
1. ఆహారపదార్థాలను కొనేటప్పుడు ఎక్కువ శ్రద్ధ వహించి యోగ్యమైన వాటినే కొనాలి. మెత్తబడిన, పగిలిన కూరగాయలు, పండ్లు కొనగూడదు.
 
2. ఆహారపదార్థాలను గాలి, వెలుతురు తగిలే చోట, తేమ తగలకుండా నిలువ చేయాలి. అలాగే వండే ముందు పండ్లు, కూరగాయలను ఎక్కువ నీటిలో శుభ్రంగా కడగాలి.
 
3. వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా వంటకు శుభ్రమైన నీటిని వాడాలి. 
 
4. మనం త్రాగే నీరు కాచి చల్లార్చి, వడబోసి తాగడం శ్రేయస్కరం.
 
5. వండిన పదార్థాలపై ఎప్పుడూ మూత వేసి ఉంచాలి. లేకపోతే క్రిములు చేరి కలుషితం చేస్తాయి.
 
6. వంట ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే శరీర శుభ్రత కూడా చాలా అవసరం. వంట చేసే ముందు, వడ్డించే ముందు అలాగే తినబోయే ముందు కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
 
7. ముఖ్యంగా చిన్నపిల్లల ఆహార విషయంలో శుచి, శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పాలు పట్టడానికి వాడే సీసాలు, పీకలను చాలా శుభ్రంగా కడిగి వేడి నీటిలో మరగబెట్టి వాడాలి.
 
8. ఆహారం పరిశుభ్రత లోపిస్తే రోగాలకు గురి అవడమే కాకుండా కొన్ని సందర్భాలలో మరణానికి కూడా దారి తీయవచ్చు. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

అన్నీ చూడండి

తల్లి - చెల్లిని బెంగుళూరు రోడ్లపై నిలబెట్టిన జగన్.. కోర్టు ఆదేశాలతో (వీడియో)

భార్యతో గొడవ - రూ.500 కరెన్సీ నోట్లను తగలబెట్టిన భర్త (వీడియో)

వాడుపోతే ఏ బాధా వుండదు : ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య ప్లాన్ (Video)

ఏపీ పంచాయతీ ఎన్నికలు : పోటీ చేసేందుకు జనసేన శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ

15వ వివాహం... 16వ తేదీన నవ వధువు ప్రసవం... వరుడు షాక్

అన్నీ చూడండి

మేకింగ్ నాణ్యతలో రాజీ లేదు.. అందుకే మైసా రిలీజ్ వాయిదా

బాలీవుడ్ బిగ్ బి గొప్ప మనసు - సామాజిక కార్యకర్తకు రూ.21 లక్షల విరాళం

సామాజిక మార్పు కోసం పోరాడిన పూలే చిత్రం విడుదలకు సిద్ధమైంది

రాయవలస నుంచి విడుదలైన నీతో ఓ అడుగు అంటూ ప్రేమ గీతానికి మంచి స్పందన

అప్పాకుట్టి సినిమా ప్రమోషన్-రైలులో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ (video)

తర్వాతి కథనం
Show comments