గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ttdj
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (15:27 IST)

మీ ఇంట్లో ఎవరైనా గురకపెడుతున్నారా.. అయితే ఇలా చేయండి...

గురక కారణంగా మన పక్కన నిద్రించే వాళ్ళకు కలిగే ఇబ్బంది చిన్నదేం కాదు. చూసేందుకు ఫన్నీగా కనిపించినా అనుభవంలోకి వస్తే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. బరువు ఎక్కువగా ఉండడం, ఆల్కహాల్‌ అలవాటు ఉండటం వల్ల గురక

గురక కారణంగా మన పక్కన నిద్రించే వాళ్ళకు కలిగే ఇబ్బంది చిన్నదేం కాదు. చూసేందుకు ఫన్నీగా కనిపించినా అనుభవంలోకి వస్తే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. బరువు ఎక్కువగా ఉండడం, ఆల్కహాల్‌ అలవాటు ఉండటం వల్ల గురక వస్తుంది. నిద్రించే సమయంలో ముక్కు, గొంతు ద్వారా గాలి సరిగ్గా ఆడకపోవడం వల్ల ఆ చుట్టుపక్కల కణాలు వైబ్రేట్‌ అవుతాయి. అందువల్లే గురక వస్తుంది. భాగస్వామి అంటే ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ గురక వల్ల వారికి దూరం కావాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.
 
గురకను తగ్గించుకోవడం కోసం స్థూలకాయులు బరువు తగ్గించుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. పొగతాగే అలవాటు ఉన్న వెంటనే మానేయాలి. ఆల్కహాల్‌, నిద్రమాత్రలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించాలి. నిద్రిస్తున్న భంగిమను మార్చుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. వెల్లకిలా పడుకునేవారు పక్కకు తిరిగి నిద్రిస్తే కొంతవరకు సమస్య తగ్గుతుంది. నోటిని తెరిచి ఉంచి దవడను ఎడమవైపు తిప్పి 30 సెకన్ల పాటు అలా ఉంచాలి. తర్వాత కుడివైపు కూడా అలాగే చేస్తే ఫలితం ఉంటుంది. 
 
ఆలివ్‌ ఆయిల్‌ తేనెను అర టీ స్పూన్‌ మోతాదులో తీసుకొని నిద్రకు ఉపక్రమించే ముందు తాగితే ఫలితం ఉంటుంది. గ్లాసు వేడి నీటిలో అరటీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురకపెట్టడం తగ్గుతుంది. ఈ చిట్కాలు పాటించినప్పటికీ గురక తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.