శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 6 జూన్ 2019 (19:26 IST)

వేపాకులను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే...?

వృక్ష సంపదలో కొన్నింటికి అద్వితీయమైన ఔషధ గుణాలున్నాయి. ఏ చెట్టు ఆకులో ఏమున్నదో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.
 
1. సబ్జా ఆకును పిండి రసము తీసి చెవిలో పోస్తే చెవినొప్పి తగ్గుతుంది.
2. ఒక పెద్దస్పూన్ తులసి రసం ప్రతి రోజు త్రాగితే రక్తం శుభ్రపడటమే కాక గొంతు ఇన్ఫెక్షన్, కడుపునొప్పి తగ్గుతుంది.
3. మామిడి ఆకుల నుండి తీసిన పసరును కొద్దిగా వేడి చేసి చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది.
4. పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు రాత్రి పూట ముఖానికి రాసి ప్రొద్దుటే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ విధంగా చేయటం వల్ల మొటిమలు మచ్చలు తగ్గుతాయి.
5. వేపాకులను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద వున్న ఎటువంటి మచ్చలయినా త్వరగా పోతాయి.
6. ఒక కప్పు వేపాకులను కొద్ది నీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడకట్టి, ఆ నీటిని ముఖానికి రాసుకుంటే ఆయిల్ స్కిన్ వారికి అస్ట్రింజెంట్‌లా పనిచేస్తుంది.
7. వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే జుత్తు ఊడటం తగ్గి నల్లగా పొడవుగా పెరుగుతుంది.