బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 6 జూన్ 2019 (13:51 IST)

తులసి ఆకు సంగతి తెలిస్తే... ఉదయాన్నే ఖచ్చితంగా నూరేసి...

తులసి ఆకులలో వున్న ఔషధ గుణాలు ఎంత చెప్పినా తక్కువే. ఆకలి మందగించిన వారు తులసి ఆకుల రసం తీసి దానితో తమలపాకు రసమును, పంచదారతో చేర్చి కొద్ది మోతాదులో ప్రతినిత్యం సేవించిన జీర్ణక్రియ సరిగా జరిగి ఆకలి బాగా వేస్తుంది. తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున వేసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. 
 
తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులను నమిలితే జీర్ణశక్తి మెరుగవుతుంది. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే వాంతులు ఆగుతాయి. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది. తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి. 
 
తులసి కషాయాన్ని తాగితే కాలేయానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. తులసి రసమును తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది. తులసి రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది.