చర్మవ్యాధులకు సరైన ఔషధం శెనగలు
శెనగలను సంస్కృతంలో చణక అంటారు. శెనగలు మూడు రకములు. 1.జాతి శెనగ 2.హైబ్రీడు శెనగ 3.తెల్ల శెనగ. ఇవి మిక్కిలి లావుగా ఉండడమే కాకుండా ఎక్కువ రేటును కలిగి ఉంటుంది. దీని ఆకులు చిన్న ఆకారంలో ఉంటుంది.
శెనగలను సంస్కృతంలో చణక అంటారు. శెనగలు మూడు రకములు. 1.జాతి శెనగ 2.హైబ్రీడు శెనగ 3.తెల్ల శెనగ. ఇవి మిక్కిలి లావుగా ఉండడమే కాకుండా ఎక్కువ రేటును కలిగి ఉంటుంది. దీని ఆకులు చిన్న ఆకారంలో ఉంటుంది. ఈ శెనగ ఆకుల నుంచి పులుసు (ఆమ్లము) తయారుజేసి పైత్యమకు మందుగా వాడుతారు. శెనగలలో ఐరను, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణకావటానికి 3 గంటల సమయం పడుతుంది.
శెనగలలో చలువ చేసే గుణాలు ఉంటుంది. ఇవి రక్త దోషములను పోగొట్టి బలమును కలిగిస్తుంది. శెనగలు సులభముగా జీర్ణం అవుతుంది. శెనగాకును ఆహారంగా వాడటం వల్ల పిత్తరోగములు నశిస్తుంది. ఇవి చిగుళ్ల వాపును తగ్గించగలవు. కడుపు ఉబ్బరము కలిగిస్తుంది. 40 సంవత్సరాలు దాటిన కొందరు పురుషులు శీఘ్రస్కలన మవుతుందని బాదపడుతుంటారు. అలాంటి వారు రెండు చెంచాల శెనగపిండిలో కొంచెం ఖర్చూరం, పాలపిండి కలిపి ప్రతిరోజూ 15 రోజుల పాటు రోజుకు రెండుసార్లు తీసుకుంటే శీఘ్రస్కలనము తగ్గడమే కాకుండా బలాన్ని కూడా ఇస్తుంది.
గజ్జి, చిడుము, తామర గల వారు ప్రతిరోజూ శెనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తుంటే ఆ వ్యాధులు మటుమాయమవడమే కాకుండా దేహమును, ముఖమునకకు కాంతి కలిగిస్తుంది. మొటిమలు నశిస్తుంది. షాంపుకు బదులు ప్రతిసారీ శెనగపిండితో తలను రుద్ది స్నానం చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి. అంతేకాకుండా శిరోజాలు పట్టుకుచ్చువలె కాంతతివంతములై వాని కుదుళ్లు గట్టిగా ఉంటాయి. మూత్ర వ్యాధులు ఉన్నవారు శెనగల వాడటం తగ్గిస్తే మంచిది.