రోజుకో స్పూన్ నెయ్యి చాలు..

Written By మోహన్
Updated: సోమవారం, 19 ఆగస్టు 2019 (19:17 IST)
సాధారణంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు నెయ్యిని కూడా ప్రముఖంగా ఉపయోగిస్తుంటాం. నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాల్ని అందిస్తుంది. ఇది ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా అందానికి కూడా దివ్య ఔషధంలా పని చేస్తుంది. నెయ్యి ఆరోగ్యంతో పాటు సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
నెయ్యిలో అనేకమైన సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నెయ్యి చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది వివిధ రకాల చర్మ సమస్యలతో పాటు చర్మం పొడిబారకుండా నివారిస్తుంది. నెయ్యిలో పుష్కలంగా ఉండే ఫ్యాటీ యాసిడ్స్ పొడిబారిన చర్మానికి అవసరమైన తేమను అందించి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. కొద్దిగా నెయ్యిని చేతిలోకి తీసుకుని ముఖానికి రాసి, మసాజ్ చేయడం వల్ల డ్రై స్కిన్ కంట్రోల్ అవుతుంది.
 
* చర్మాన్ని మృదువుగా చేస్తుంది:
నెయ్యితో పాటు కొద్దిగా నీరు తీసుకుని, రెండింటినీ బాగా మిశ్రమంగా కలిపి చర్మానికి రాయాలి. కొంతసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం నిగనిగలాడేందుకు నెయ్యి అద్భుతంగా సహాయపడుతుంది. కళ్ల క్రింద నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు, ప్రతిరోజూ రాత్రి నిద్రించడానికి ముందు కళ్ల క్రింది భాగంలో నెయ్యిని రాయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి.
 
* జట్టు చిట్లకుండా చేస్తుంది:
డ్రై హెయిర్ కారణంగా జట్టు తరచూ చిట్లుతుంటుంది. ఈ సమస్యకు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. నెయ్యిని గోరువెచ్చగా కాచిన తర్వాత, జుట్టు కొసలకు అప్లై చేయాలి. ఇలా చేసిన 1 గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా జుట్టు చిట్లడం తగ్గుతుంది. అంతేకాకుండా నెయ్యిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించిన అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెయ్యి మంచి కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది.

అన్నీ చూడండి

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Gudivada: కొడాలి నాని సహాయకుడి బర్త్‌డే పార్టీపై దాడి, మద్యం స్వాధీనం

జూబ్లీహిల్స్ భూవివాదం కేసు : ఇద్దరు సినీ నిర్మాతలపై కేసు

SATకు ఎంపికైన ఏకైక బాలిక.. వడ్రంగి కుమార్తె అదరగొట్టింది..

ఆస్తి వివాదం.. అత్తను కూరగాయలు కోసే కత్తితో హత్య చేసిన కోడలు

అన్నీ చూడండి

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

మనకెందుకులే అని దాటవేసే మనస్తత్వాన్ని వీడండి : మంచు లక్ష్మి పిలుపు (Video)

భగవంత్ కేసరి చిత్రం నుంచి ప్రేరణ పొందాం.. నిర్మాత వెంకట్

తర్వాతి కథనం
Show comments