శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (15:10 IST)

సీతాఫలంతో టీబీ మటాష్.. శస్త్రచికిత్సకు తర్వాత ఈ ఫలాన్ని తింటే? (video)

సీతాఫలంలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా? అయితే చదవండి మరి. సీతాఫలంలోని ధాతువులు హృదయాన్ని బలపరుస్తాయి. హృద్రోగ సమస్యలను దూరం చేస్తాయి. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ఇది నయం చేస్తుంది. టీబీని దరిచేరనివ్వదు. టీబీని ఆరంభదశలోనే సీతాఫలం అరికడుతుంది. సీతాఫల రసం తాగితే.. వేసవి ఏర్పడే దాహార్తి తగ్గుతుంది. 
 
ఇంకా శరీరానికి చలువ చేస్తుంది. వేవిళ్ళను నియంత్రిస్తుంది. శస్త్రచికిత్సకు అనంతరం సీతాఫలాన్ని తీసుకుంటే.. కుట్లు త్వరగా మానిపోవడం.. శస్త్రచికిత్స అనంతరం త్వరలో కోలుకోవడం జరుగుతుంది. కాసింత మెంతుల్ని తీసుకుని నానబెట్టి, సీతాఫలంతో చేర్చి తీసుకుంటే.. పేగు సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. సీతాఫలం కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. 
 
శరీరంలో రక్తాన్ని సీతాఫలం శుద్ధి చేస్తుంది. ఇందులోని గ్లూకోజ్ వుండటంతో శరీరాన్ని అలసిపోనివ్వదు. ఉష్ణ సంబంధిత రోగాలను ఇది దరిచేరనివ్వదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.