Rainy Season Health Tips, వర్షాకాలంలో ఇలా చేయాలి

ఆదివారం, 10 అక్టోబరు 2021 (16:38 IST)
వర్షాకాలంలో బయట తిరిగి వచ్చిన వెంటనే చల్లని పదార్థాలను తినకూడదు. రోడ్ల పక్కన తోపుడు బండ్లపై అమ్మకానికి ఉంచిన వివిధ రకాల పండ్ల ముక్కలను తినొద్దు. ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలను యధావిధిగా తినడం కంటే కాస్త వేడి చేసి తినడం మంచిది. పెరుగు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
 
బయట నుంచి ఇంటికి రాగానే కాళ్లూచేతులు శుభ్రం చేసుకుని ఇంట్లోకి వెళ్ళడం మంచిది. దీనివల్ల బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా నశిస్తుంది. బాగా ఆరిన దుస్తులను మాత్రమే ధరించాలి. ధరించే వస్త్రాలు కాస్త తడిగా ఉన్నట్టయితే, చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
 
వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలలో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శరీరంలో నీరు చేరటం, మూత్రనాళ ఇన్ఫెక్షన్, శిరోజాల, చర్మ సమస్యలుంటాయి. ఇటువంటి రుతు సంబంధిత ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే వీధుల్లో అమ్మే పదార్థాలను తినకూడదు. ఆహారంలో ఆమ్లగుణం అధికంగా ఉండే వేపుళ్లు, మాంసం తీసుకోకుండా ఉండటం మేలు. పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి.
 
ఆహార పదార్థాల ద్వారా బ్యాక్టీరియా శరీంలోకి చేరే ప్రమాదం అధికంగా ఉండేకాలం కనుక వ్యక్తిగత శుభ్రత విషయంలో మరీ జాగ్రత్త అవసరం. స్నానం చేసే నీళ్లలో వేపాకులు లేదా వేపాకు పసరు వేసుకుని చేస్తే చర్మ వ్యాధులకు ఆస్కారం ఉండదు.
 
పాతబియ్యం వాడటం వల్ల శరీరానికి ఇబ్బందులు తప్పుతాయి. అల్లం, పసుపు, కాకరకాయ, ఉసిరి వంటివి విరివిగా ఆహారంలో వాడితే ఇన్ఫెక్షన్ రాదు. ప్రతిరోజు పసుపు లేదా చందనం పొడిని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. చల్లగా ఉంటే టీ తాగాలనిపిస్తుంది. అయినా టీ, మత్తుపానీయాల వంటివాటిని బాగా తగ్గించేయడం చాలా మంచిది.

అన్నీ చూడండి

ఫిన్‌లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థి.. బీచ్‌లో మృతదేహం

బుల్లెట్ ట్రైన్ హబ్‌గా తెలంగాణ : 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నై

Nara Brahmani: నారా బ్రాహ్మణీకి అరుదైన అవార్డు.. నారా లోకేష్ కితాబు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : భర్త శ్రీచరణ్ అరెస్టు

ముంబై ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఆపరేషన్

అన్నీ చూడండి

Rasha Thadani: తెలుగు సినిమా చాలా అడ్వాన్స్‌గా ఉంది : హీరోయిన్ రాషా తడానీ

Priyadarshi: ప్రియదర్శి నటిస్తున్న ఇడుపు కాయితం విడుదల తేదీ ఫిక్స్

Aishwarya: రహస్యాన్ని దాచి తిరు వీర్, ఐశ్వర్య ను పెళ్లి చేసుకుంటే ఏమయింది?

Nagarjuna: తిరుమల వేంకటేశ్వరుడే అఖిల్ కు సక్సెస్ ఇచ్చాడు : అక్కినేని నాగార్జున

అఖిల్ అక్కినేని 'లెనిల్' తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments