గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (13:14 IST)

వర్షాకాలం... తస్మాత్ జాగ్రత్త.. జ్వరం - సీజనల్ వ్యాధులతో అప్రమత్తత

వర్షాకాలం వచ్చేంది. చిన్నపాటి వర్షంలో తడిసినా జలుబు, తుమ్ములు వచ్చేస్తాయి. వీటితో పాటు.. దగ్గులు, జ్వరాలు, వీరేచనాలు.. వంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి మనమీద వీర విహారం చేస్తాయి. అందుకే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సురక్షిత నీటిని తాగాలని చెబుతుంటారు వైద్యులు. 
 
వర్షంలో తడిసిన తర్వాత చలిజ్వరం, వణుకు వస్తే మలేరియా అని అనుమానం రావాలి. జ్వరం తగ్గి చెమటలు పట్టి మళ్లీ జ్వరం వస్తుంటుం ది. రక్త పరీక్షల ద్వారా మలేరియా ఉందో లేదో నిర్ధారించు కోవచ్చు. ఉంటే సకాలంలో సరైన వైద్యం చేయించాలి. 
 
వైరల్‌ ఫీవర్‌ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలన్ని డెంగ్యు వచ్చినప్పు డు కనిపిస్తాయి. జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, విరోచనాలు, దద్దుర్లు రావచ్చు. వైరల్‌ ఫీవర్‌తో మనలోని రోగ నిరోధక శక్తి నశిస్తుంది. 
 
కాబట్టి ఎక్కడబడితే అక్కడ నీళ్లు నిల్వ ఉంచుకుండా చూడాలి. అలా చేస్తే దోమ లు పెరిగే అవకాశాల్ని చాలా వరకు తగ్గించినట్లవుతుంది. అ లాగే ఇంటికి మెస్‌లు, మంచాలకు దోమతెరలు, మస్కిటో రి ప్లెంట్‌లు వాడి దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి.