శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జూన్ 2017 (11:55 IST)

బానపొట్టను తగ్గించుకోవడం ఎలా?

బానపొట్టను తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ పరగడుపున ఒకటి లేదా రెండు టమోటాలను తినండి. టమోటాలో ఉండే ఆక్సో ఓడీఏ అనే పదార్థం కొవ్వును కరిగిస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే పుదీనా ఆకుల రసాన్ని తాగండి. దీనివల్ల మె

బానపొట్టను తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ పరగడుపున ఒకటి లేదా రెండు టమోటాలను తినండి. టమోటాలో ఉండే ఆక్సో ఓడీఏ అనే పదార్థం కొవ్వును కరిగిస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే పుదీనా ఆకుల రసాన్ని తాగండి. దీనివల్ల మెటబాలిజం పెరిగి, ఒంట్లోని క్యాలరీలు కరిగిపోతాయి.
 
ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో అల్లం రసం కలుపుకుని తాగండి. దీని వల్ల కొవ్వు తగ్గడమే కాదు. అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తీసుకుని, అందులో నిమ్మకాయను పిండి తాగండి. అవసరమైనే ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు. నిమ్మకాయకు కొవ్వును కరిగించే అద్భుత శక్తి ఉంది. 
 
రోజూ పరగడపున అలోవెరా జ్యూస్ తాగడం మంచిది. దీనివల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంది. ఇది తీసుకున్న అరగంట తర్వాత ఒక తాజా పండును తినండి చాలు. బరువు తగ్గాలనుకున్నవారు రోజూ సుమారు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల మెటబాలిజమ్ రేట్ పెరిగి, అధిక బరువు పెరగకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.