1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 23 మే 2016 (22:07 IST)

వేసవి ఎండదెబ్బ... వడదెబ్బకు విరుగుడు...

ఉదయం, సాయంత్రం పచ్చి ముల్లంగి దుంపలు తినిపించాలి. చింతపండు నీటిలో నానబెట్టి రసం తీసి తాళింపు వేసి భోజనంతో పాటు తీసుకోవాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూను పొడిని, ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి, ఉప్పు, పంచదార వేసుకుని తాగాలి. పచ్చి మామిడికాయ ఉడికించి రసం తీసి పంచదార కలిపి తాగించాలి. 
 
ద్రవపదార్థాలు మజ్జిగ, నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు పైన తేటనీరు వంచి చిటికెడు ఉప్పు కలిపి తాగితే వడదెబ్బ నివారించబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.