శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (17:36 IST)

ఆకలిని నియంత్రించి.. కొవ్వుకు చెక్ పెట్టే టమోటా..

స్లిమ్‌గా తయారవ్వాలా? అయితే టమోటాను డైట్‌లో చేర్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టమోటాను రోజువారీ ఐదు నుంచి ఆరింటిని తీసుకుంటే శరీర బరువు తగ్గుతుంది. బాగా పండిన టమోటా పండును తీసుకుని పరగడుపున తింటే

స్లిమ్‌గా తయారవ్వాలా? అయితే టమోటాను డైట్‌లో చేర్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టమోటాను రోజువారీ ఐదు నుంచి ఆరింటిని తీసుకుంటే శరీర బరువు తగ్గుతుంది. బాగా పండిన టమోటా పండును తీసుకుని పరగడుపున తింటే పొట్ట తగ్గుతుంది. ఇంకా ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు ఓ టమోటాను తింటే బరువు బాగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
టమోటాలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వాపు, బరువు, కిడ్నీ, పేగు వ్యాధులు, కాలేయ సమస్యలను నయం చేసుకోవచ్చు. టమోటాలో విటమిన్ సి గుండెకు మేలు చేస్తుంది. 
 
కొవ్వును శరీరంలో చేరనివ్వదు. ఆకలిని పెంచే హార్మోన్లను టమోటా క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. శాండ్‌విచ్‌లో టమోటా చేర్చుకుని తీసుకోవడం ద్వారా బరువు పెరగరని పరిశోధనలు తేల్చాయి.