సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 మే 2017 (11:07 IST)

రోజూ అరకప్పు ఉడికించిన బ్రోకోలీ తీసుకుంటే?

బ్రోకోలీని ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. బ్రోకోలీని తీసుకుంటే ఊపిరితితిత్తులు, కడుపు, కోలన్ క్యాన్సర్‌లు దరిచేరవు. అరకప్పు ఉడికించిన బ్రోకోలీని రోజూ తీసుకుంటే క్యాన్సర్ కారక

బ్రోకోలీని ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. బ్రోకోలీని తీసుకుంటే ఊపిరితితిత్తులు, కడుపు, కోలన్ క్యాన్సర్‌లు దరిచేరవు. అరకప్పు ఉడికించిన బ్రోకోలీని రోజూ తీసుకుంటే క్యాన్సర్ కారకాలు నశించిపోతాయి. బ్రోకోలీ లభించకపోతే ప్రత్యామ్నాయంగా క్యాబేజీని వాడుకోవచ్చు. బ్రోకోలీలో లభించే అన్ని కాంపౌండ్లు క్యాబేజీలోనూ ఉన్నాయి. బ్రోకోలీలో ఉండే సల్ఫోరఫేన్ అనే సల్ఫర్ కాంపౌండ్ల వల్ల క్యాన్సర్ దూరమవుతుంది. 
 
అలాగే చర్మ ఆరోగ్యానికి బ్రోకోలీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఎ, కె, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి సంరక్షణ ఇస్తుంది. బ్రోకోలీలోని బీటా కెరోటీన్ కంటి దృష్టిలోపాలను దూరం చేస్తుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు బ్రోకోలీని తీసుకోవచ్చు. దంత సమస్యలకు చెక్ పెట్టాలంటే వారానికి రెండు సార్లు బ్రోకోలీని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.