శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శనివారం, 3 జూన్ 2017 (15:48 IST)

బానపొట్ట తగ్గాలా? రాత్రి పూట ఈ డ్రింక్ తాగండి

కీరదోసకాయ నిమ్మపండు రసం, అల్లం పేస్టు, కలబంద జ్యూస్‌ను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని.. ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకుని నీటిని చేర్చి.. గ్లాసుడు మేర రాత్రి నిద్రించేందుకు అరగంటకు ముందు తీసుకుంటే మంచి ఫల

బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారా..? డైట్, జిమ్‌ల వెంట పడుతున్నారా? అయితే సులభంగా బరువు తగ్గించుకునేందుకు ఇలా చేయండి. బానపొట్ట తగ్గాలంటే... అనవసరపు కొవ్వును కరిగించాలంటే.. రాత్రి నిద్రించేందుకు ముందు ఈ పానీయాన్ని తాగడం ద్వారా మూడు నెలల్లోపు పూర్తిగా బరువు తగ్గుతారు. 
 
పానీయానికి కావలసిన పదార్థాలు.. 
కీరదోస కాయ - ఒకటి 
నిమ్మపండు - ఒకటి 
అల్లం పేస్టు - ఒక టీ స్పూన్
కలబంద జ్యూస్ - ఒక టేబుల్ స్పూన్ 
నీరు- ఒక గ్లాసు 
 
తయారీ ఎలాగంటే? 
కీరదోసకాయ నిమ్మపండు రసం, అల్లం పేస్టు, కలబంద జ్యూస్‌ను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని.. ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకుని నీటిని చేర్చి.. గ్లాసుడు మేర రాత్రి నిద్రించేందుకు అరగంటకు ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా 2 నెలల పాటు చేస్తే బాన పొట్ట తగ్గిపోతుంది. ఒబిసిటీతో ఇబ్బందులుండవ్.