ఉడకబెట్టిన శెనగలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఎన్నో పోషకాలు కలిగిన చిరుధాన్యాల్లో శెనగలు ఒకటి. వీటిలో ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. అందుకే శెనగలను చాలామంది ఇష్టపడి తింటుంటారు. ఉడకబెట్టిన శెనగలను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాము. తీసుకునే ఆహారంలో శెనగలను భాగం చేసుకోవడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మహిళల్లో రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. సన్నగా ఉండేవారు రోజూ వీటిని తింటే త్వరితగతిన బరువు పెరిగే అవకాశం ఉంది. శెనగలు తింటుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ అందుతాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయి. శెనగలు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు దరిచేరవు. రక్త హీనత సమస్యతో బాధపడేవారు ఉడకబెట్టిన శెనగలను తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది.