మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 25 మే 2023 (18:42 IST)

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుకునేందుకు ఏం చేయాలి?

Almonds
కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరం. ఐతే చెడు కొలెస్ట్రాల్-ఎల్డీఎల్ ఎక్కువైతే శరీరానికి ముప్పు ఏర్పడుతుంది. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఆ కొవ్వును తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలి. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాము. శరీర బరువును ఎట్టి పరిస్థితుల్లో పెరగకుండా చూసుకోవాలి. బరువు పెరిగితే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. బీపీ, షుగర్ సమస్యలు ఏర్పడుతాయి.
 
చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా వుండేందుకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా దంపుడు బియ్యం, జొన్నలు, సజ్జలు, ఓట్స్ తింటుండాలి. రక్తనాళాల్లో పూడికలు తగ్గడానికి సాల్మన్, టూనా వంటి చేపలను నూనెలో కాకుండా ఉడికించి తినాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, అక్రోట్లలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే కొవ్వులు వుంటాయి కనుక వాటిని తీసుకోవాలి. గది ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టని పొద్దుతిరుగుడు నూనె, వేరుశెనగ నూనె, ఆలివ్ నూనెలు చెడ్డ కొవ్వును తగ్గించి మేలు చేస్తాయి.
వెన్న తీయని పాలు, వెన్న, పామాయిల్, మాంసం చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి, కనుక వాటిని తీసుకోవడం దూరం పెట్టాలి.
 
ఈరోజుల్లో పని ఒత్తిడి సాధారణమైంది కనుక రక్తపోటు సమస్యలు వుంటున్నాయి. అది రాకుండా విశ్రాంతి తీసుకుంటూ తగు వ్యాయామం చేస్తుండాలి.