యోగాసనాలు ఆత్మశక్తికి సోపానం...

సంస్కృతంలో యోగాకి అర్థం కలపడం. మన దేహాన్ని ఆ పరమాత్మకి అనుసంధించేలా చేసే విధానమే యోగా. ఆత్మని దైవంతో, బుద్ధిని ఆత్మతో కలుపుతుంది ఈ యోగా. ఏ విషయం మీద మనస్సు కొద్దిసేపయినా ఏకాగ్రతతో లగ్నం కాలేదు. ఇంద్రి

Kowsalya| Last Updated: గురువారం, 21 జూన్ 2018 (12:36 IST)
సంస్కృతంలో యోగాకి అర్థం కలపడం. మన దేహాన్ని ఆ పరమాత్మకి అనుసంధించేలా చేసే విధానమే యోగా. ఆత్మని దైవంతో, బుద్ధిని ఆత్మతో కలుపుతుంది ఈ యోగా. ఏ విషయం మీద మనస్సు కొద్దిసేపైనా ఏకాగ్రతతో లగ్నం కాలేదు. ఇంద్రియాలకు అనుగుణంగా ఆలోచనలు మనస్సులో మెదులాడుతుంటాయి. నిరంతం యోగాసాధన వలన మానసికంగా ఓ అత్యున్నత స్థాయికి చేరినప్పుడు క్రింది తెలిపిన అంశాలు లభిస్తాయి.
 
మనస్సుని అదుపులో ఉంచుకుని సక్రమంగా ఉంచుకున్నప్పుడు జీవితంలో ఉన్నతమైన వాటిని సాధించే అవకాశం కలుగుతుంది. అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీస్తుంది. శారీరక దారుఢ్యం సంతరించుకోవడమే కాక కొత్త అంశాలను కనుగొనే సృజనాత్మక యోగాసనాలు శక్తిని ప్రసాదిస్తాయి. భవిష్యత్‌ని ఆకళింపు చేసుకునే ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.
 
చక్కటి అవగాహన, విశ్లేషణలతోపాటు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. సంపదలు లభిస్తాయి. మీ మనస్సుని, దేహాన్ని మీరు సక్రమంగా అర్థం చేసుకోగలిగినప్పుడు తోటివారిని బాగా అర్థం చేసుకోగలగాలి. మనస్సును నియంత్రించే శక్తి మీలో సహజంగా ఏర్పడుతుంది. ప్రకృతి లక్షణాలను, సూత్రాలను అర్థం చేసుకునే శక్తి లభిస్తుంది. అది కొత్త కొత్త ఆలోచనలకు, అన్వేషణలకు దారి తీస్తుంది. 
 
నిరంతర సాధన వలన లభించే ఏకాగ్రత మీ మానసిక, శారీరక, అనారోగ్యాలను నియంత్రించడమే కాదు. తోటి వారి సమస్యలను తొలగించే శక్తిని కూడా కలిగిస్తుంది. దైవ శక్తిని సందర్శించే స్థాయికి మీలోని చేతనావస్థని జాగృతం చేయవచ్చును. యోగ సాధనలో ఓ స్థాయికి చేరుకున్నాక జీవితంలో మీరేం సాధించాలనుకుంటున్నారనే దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.దీనిపై మరింత చదవండి :