విలువలతో కూడిన జీవన విధానమే ఆగమాలు: జేఈవో భాస్కర్
చాలా దేశాలలో ఆలయాలు అనాది వస్తున్న ఓ పెద్ద సంస్కృతి అని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో పోలా భాస్కర్ అన్నారు. ఆ ఆలయాలలో జరిగే కైంకర్యాలను ఓ క్రమ పద్దతిలో చెప్పేవే ఆగమాలని వివరించారు. మానవునికి విలువలతో కూడా జీవన విధానాన్ని నేర్పేవే ఆగమాలని ఆయన చెప్పారు.
తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆగమ శాస్త్ర సెమినార్ కు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలాంటిది అర్చకులు లేక చాలా ఆలయాలలో కైంకర్యాలే జరగడం లేదని అన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి అర్చక శిక్షణను చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇలాంటి సదస్సులు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాలలో నిర్వహించాలని కోరారు.
అప్పుడే కొత్తగా వచ్చేవారికి అపార జానం లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ ప్రధానార్చకులు రమణదీక్షితులు, వేదిక్ యూనివర్శిటీ విసి కేఈ దేవనాథన్ తదితరులు పాల్గొన్నారు.
