శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (07:42 IST)

14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు.. టీటీడీ ఈవో

తిరుమలలో ఈ నెల 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవుల, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
తిరుమలలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ తితిదే ఈవో కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి అర్జిత సేవలు, చంటిబిడ్డలతో పాటు తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అడ్వాన్సు బుకింగ్ లేకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 
 
వీఐపీ దర్శనాలను ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే కల్పిస్తామని స్పష్టం చేశారు.నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు ఆయన వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల తరహాలోనే ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు.