బుధవారం, 4 ఫిబ్రవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: శనివారం, 28 ఫిబ్రవరి 2015 (11:56 IST)

పరకామణి సేవకుల సంఖ్య పెంపు

శ్రీవారి ఆలయంలో హుండీ లెక్కింపును మరింత వేగవంతం చేయడానికి పరకామణిలో తిరుమల తిరుపతి దేవస్థానం సేవకుల సంఖ్యను పెంచుతోంది. అదనంగా 130 మందిని తీసుకుంటున్నారు. మరింత వేగంగా పెంచడం వలన మెరుగైన సేవలు అందించవచ్చునని తిరుమల తిరుపతి దేవస్థానం అభిప్రాయపడుతోంది. పెరిగిన పరకామణి సేవకుల సేవలు రేపటి నుండి అమలులోనికి రానుంది. 
 
ప్రస్తుతం ఒక బ్యాచ్‌కి 120 మందికి అవకాశం కల్పిస్తున్న  పరకామణి సేవకుల సంఖ్యను 250 మందికి అవకాశం కల్పించనుంది. అదే విధంగా మూడు షిప్టులో విధానాలు ఉంటాయి.  'ఏ' షిప్టులో 100మంది సేవకులు 'బి' షిప్టులో 100 సేవకులు 'సి'  షిప్టులో 50 సేవకులు సేవచేసే అవకాశం ఉంటుంది. అందులో 'ఏ' షిప్టు ఉదయం 7 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సేవ చేయాల్సి ఉంటుంది.
 
బి షిప్టు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 వరకు సేవ చేయాల్సి ఉంటుంది. సి షిప్టు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సేవ చేయాల్సి ఉంటుంది. పరకామణి సేవకులు సేవ చేయాల్సిన తేది మరియు షిప్టు ఆన్‌లైన్‌ లోనే రిజిస్టరు చేసుకొని తదనుగుణంగా సేవకు రావలసి ఉంటుంది. వీరు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.