1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. svbc broadcastings on Godavari Puskaralu

గోదావరి పుష్కరాలను ప్రసారం చేయండి : ఎస్వీబీసీకి టీటీడీ ఛైర్మన్ ఆదేశం

svbc
భక్తి మార్గాన్ని మరింతగా ప్రసారం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలో నడుస్తున్న ఎస్వీబీసి భక్తి చానెల్ కు గోదావరి పుష్కరాలు మంచి అవకాశమని తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్ జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. తిరుపతిలో ఆయన భక్తి చానెల్ అధికారులతో సమావేశం అయ్యారు. భక్తిని ప్రసారం చేసే చానెళ్ళలో ఎస్వీబీసీ ముందు వరుసలో ఉందని అన్నారు. 
 
ఈ యేడాది జూన్ నెల 14 నుంచి 25 వరకూ 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు అందించడంలో ముందుండాలని కోరారు. ఎక్కడెక్కడ ఘాట్లు ఉన్నాయి. పుష్కరాల యొక్క ప్రాధాన్యత వంటి అంశాలను ప్రసారం చేయడం భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ఆయన సూచించారు. అక్కడి ఏర్పాట్లను గురించి తెలపడం వలన భక్తులను మరింతగా ఆకట్టుకోవచ్చునని అన్నారు. 
 
About Writer
PYR