1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. TTD EO INSPECTS QUEUE LINES

తిరుమలలో ఈవో విస్తృత తనిఖీలు

TTD EO
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు మంగళవారం సాయంత్ర తిరుమలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 పర్వదినాలను దృష్టిలో పెట్టుకున్న ఆయన దివ్యదర్శనం క్యూలైను, స్కానింగ్ పాయింటు, ఫోటో మెట్రిక్ పాయింటు, కిచెన్, వైకుంఠం2, నందకం, కళ్యాణ వేదికలలో తనిఖీలు చేశారు.
 
కంపార్టుమెంట్లలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను స్వయంగా పరిశీలించారు. కిచెన్లో వంటకాలను పరిశీలించారు. అక్కడ ఉన్న పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు చేశారు. మూడుగంటల పాటు ఆయన అన్ని చోట్ల తనిఖీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమేష్ రెడ్డి, ఏసివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు పాల్గొన్నారు. 
About Writer
PY REDDY