గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (18:27 IST)

ముంబైలో రొమాన్స్ చేస్తున్న నాని, మృణాల్.. శ్రుతిహాసన్ కూడా..?

Nani_Mrunal
Nani_Mrunal
నేచురల్ స్టార్ నాని తాజా సినిమా ముంబైలో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాని, మృణాల్‌లపై సుదీర్ఘమైన రొమాన్స్ సన్నివేశం కోసం ఇటీవల గోవాలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. 
 
ఈ చిత్రంలో శృతిహాసన్ కూడా గోవా షూటింగ్‌లో పాల్గొంది. తదనంతరం సిబ్బంది ముంబైకి మకాం మార్చారు. ఆ నగరంలో చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది.
 
ఇది ఫ్యామిలీ డ్రామా. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే బంధంపై ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నాని ప్రేమికురాలిగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్‌కు సిద్ధం అయ్యేలా వుంది. 
 
మలయాళ చిత్రం ‘హృదయం’తో ఫేమ్‌గా నిలిచిన హేషమ్ ఈ చిత్రానికి కంపోజ్ చేస్తున్నాడు. "కుషి"లోని అతని మొదటి తెలుగు పాట "నా రోజా నువ్వే" ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే.