సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 మే 2023 (15:57 IST)

మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ.. వచ్చేవారం చికిత్స

singam dhoni
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన వచ్చే వారం చికిత్స చేయించుకోనున్నారు. ముంబైలోని కోకిలాబెన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయన చికిత్స చేయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. నిజానికి ధోనీ గత కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్నారు. ఈ గాయంతోనే ధోనీ ఐపీఎల్ సీజన్‌‍లో పాల్గొని, తన సారథ్యంలో సీఎస్కేను మరోమారు విజేతగా నిలిపాడు. 
 
ఈ నేపథ్యంలో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి చికిత్స తీసుకోవాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. మరో వారం రోజుల్లో చికిత్స ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఐపీఎల్ ప్రారంభంలోనే ధోనీ మోకాలి గాయం నుంచి చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు కూడా. ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నారని, అతని కదలికల్లో దాన్ని మనం గుర్తించవచ్చని వ్యాఖ్యానించారు.