బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

మా పోరాటం గర్వంగా ఉంది.. విజయం కోసం చివరి వరకు శ్రమించాం : హార్దిక్ పాండ్యా

hardik pandya
ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్‌ను గెలుచుకునేందుకు తాము చేసిన పోరాటం పట్ల గర్వంగా ఉందని గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నారు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయీస్ విధానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడుతూ, జట్టు పరంగా మేమంతా అద్భుతంగా ఆడాం. చివరి వరకు విజయం కోసం శ్రమించాం. మా జట్టు ఆటగాళ్లు పోరాటం చేసిన తీరు గర్వంగా ఉంది. గెలిచినా ఓడినా మా జట్టు విధానం ఒకేలా ఉంటుంది. 
 
సాయి సుదర్శన్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతంగా ఆడింది. మోహిత్, రషీద్, షమీ అందరూ నాణ్యమైన బౌలింగ్ చేశారు. ధోనీ నాయకత్వంలోని సీఎస్కే జట్టు టైటిల్‌ను గెలవడం ఆనందంగా ఉంది. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది' అని అన్నారు.