కేట్ దంపతుల సన్ బాత్ ఫోటోలు లీక్.. కోర్టులో విచారణ.. డయానా అందుకే చనిపోయిందా?
దక్షిణ ఫ్రాన్స్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఇంగ్లండ్ యువరాజు దంపతులు విడిది చేశారు. 2012లో వీరిద్దరూ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్‌లో యువరాణి కేట్ మిడిల్టన్, యువరాజుతో వ్యక్తిగతంగా సన్ బాత్
దక్షిణ ఫ్రాన్స్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఇంగ్లండ్ యువరాజు దంపతులు విడిది చేశారు. 2012లో వీరిద్దరూ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్‌లో యువరాణి కేట్ మిడిల్టన్, యువరాజుతో వ్యక్తిగతంగా సన్ బాత్ చేశారు. వీరిద్దరి సన్ బాత్‌కు సంబంధించిన ఫోటోలను ఫ్రెంచ్ గాసిప్ మ్యాగజైన్, పేపర్ క్లోజర్‌లో 2012 సెప్టెంబర్ సంచికల్లో ప్రచురించారు.
దీంతో తమ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఫోటోలు ప్రచురించిన మ్యాగజైన్ నష్టపరిహారంగా 1.5 మిలియన్ యూరోలను చెల్లించాసని రాజదంపతులు ఫ్రెంచ్ కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా క్లోజర్ మ్యాగజైన్ ఎడిటర్ లారెన్స్ పియు, సీనియర్, ఫోటో జర్నలిస్టులతో పాటు ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్టులు కోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. అయినా న్యాయస్థానం వారి వివరణపై ఏకీభవించలేదని సమాచారం.
1997లో ప్రిన్సెస్ డయానాను జర్నలిస్టులు వెంటాడడం వల్లే ఆమె మృతి చెందిందని ప్రిన్స్ విలియమ్ బలంగా నమ్ముతున్నారు. అందుకే అప్పటి నుంచి మీడియాకు రాజ కుటుంబం దూరంగా ఉంటూ వస్తోంది. అయితే 2012 సెప్టెంబర్ సంచికలో కేట్ యువరాజుతో కలిసివుండిన ఫోటోలు బహిర్గతం కావడంపై రాజ కుటుంబం సీరియస్‌గా తీసుకుంది.