శృంగార సామర్థ్యానికి మునగ పువ్వు... పావు లీటరు ఆవుపాలతో....

శృంగార సామర్థ్యం లోపం కారణంగా చాలామంది అనేక రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. కానీ కళ్ల ముందే వున్నవాటిని పట్టించుకోరు. అదేంటంటే... మునగ పువ్వులు, పావు లీటరు ఆవు పాలతో మరిగించి.. దానిలో కలకండను చేర్చి 48 రోజుల పాటు తీసుకుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుంద

drumstick leaves
ivr| Last Modified బుధవారం, 28 జూన్ 2017 (16:09 IST)
శృంగార సామర్థ్యం లోపం కారణంగా చాలామంది అనేక రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. కానీ కళ్ల ముందే వున్నవాటిని పట్టించుకోరు. అదేంటంటే... మునగ పువ్వులు, పావు లీటరు ఆవు పాలతో మరిగించి.. దానిలో కలకండను చేర్చి 48 రోజుల పాటు తీసుకుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది.

మునగ పువ్వులు, కందిపప్పు సమపాళ్లలో తీసుకుని ఉడికించి తీసుకుంటే కంటి మంట, నోటిపూత దూరమవుతుంది. మునగాకుతో నువ్వులు చేర్చి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మునగాకు, ములక్కాడలో విటమిన్ ఏబీసీలు, విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మునగాకును తీసేసిన తర్వాత ఆకుల కాడను రసంలా తయారు చేసుకుని తాగడం ద్వారా కాళ్లు, చేతుల నీరసం తొలగిపోతుంది.

మునగాకు, కీరదోస గింజలను గ్రైండ్ చేసి ఉదరంపై పూతలా పూస్తే అజీర్తి మాయమవుతుంది. మునగాకును వేపులా తయారు చేసి రోజువారీ డైట్‌లో అరకప్పు తీసుకుంటే.. మెడనొప్పి తగ్గిపోతుంది.దీనిపై మరింత చదవండి :