శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (13:02 IST)

ప్రేమ పెళ్లి: ఐఎస్‌కు భార్యను అమ్మాలనుకున్నాడు.. అలా వీడియో తీసి..?

ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నువ్వే నా ప్రాణం అన్నాడు. ఆమె కూడా అతనిని నమ్మింది. చివరికి దుబాయ్ తీసుకెళ్లాడు. అక్కడే ఆ దుర్మార్గుడి విశ్వరూపం బయటపడింది. గత ఏడాదే ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు సౌద

ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నువ్వే నా ప్రాణం అన్నాడు. ఆమె కూడా అతనిని నమ్మింది. చివరికి దుబాయ్ తీసుకెళ్లాడు. అక్కడే ఆ దుర్మార్గుడి విశ్వరూపం బయటపడింది. గత ఏడాదే ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు సౌదీలో ఆ యువతికి చుక్కలు చూపించాడు.

వివరాల్లోకి వెళితే.. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడైన కేరళకు చెందిన ఓ యువకుడు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఉగ్రవాదులకు బేరం పెట్టాడు. మహ్మద్ రియాస్ అనే వ్యక్తి బెంగళూరులో పనిచేస్తూ, గత సంవత్సరం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
 
ఆపై ఆమెను తీసుకుని సౌదీకి వెళ్లాడు. ఆ తర్వాత తనలోని రాక్షసత్వాన్ని చూపించాడు. రోజూ చిత్ర హింసలకు గురిచేస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆమెను పెట్టి అశ్లీల వీడియోలు తీసి.. సిరియాలో ఉన్న ఉగ్రవాదులకు అమ్మాలనుకున్నాడు. ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. ఇలా రెండున్నర నెలల పాటు అష్టకష్టాలు అనుభవించిన ఆ యువతి.. అతికష్టం మీద బయటపడింది. 
 
బంధువులకు ఫోనులో తానున్న ప్రాంతాన్ని పంపింది. తద్వారా లొకేషన్ గుర్తించి బాధితురాలి బంధువులు విమానం టికెట్లు బుక్ చేసి ఆన్‌లైన్‌లో పంపించగా, ఇరుగు, పొరుగు వారి సాయంతో బయటపడింది. ఓ టాక్సీ డ్రైవర్ సాయంతో ఎయిర్ పోర్టుకు చేరుకుంది. దీనిపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు మొత్తం 12 మందిపై కేసులు పెట్టారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.