గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (11:54 IST)

లిబియా: 2వేల మందిని పొట్టనబెట్టుకున్న తుఫాను

Libiya
Libiya
లిబియా ఆఫ్రికన్ ఖండంలోని ఉత్తర భాగంలో మధ్యధరా సముద్రానికి సమీపంలో ఉన్న దేశం. గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో నలిగిపోతున్న లిబియా తూర్పు ప్రాంతాలు తిరుగుబాటుదారుల చేతుల్లో ఉండగా, పశ్చిమ భాగాలు విదేశీ మద్దతు ఉన్న ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా మంది చనిపోవడంతో లిబియాను ప్రకృతి పరీక్షిస్తోంది. 
 
మధ్యధరా సముద్రంలోని శక్తివంతమైన తుఫాను డేనియల్ తుఫాను లిబియాలోని తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతాలను తాకింది. తుఫానుతో పాటు భారీ వర్షాలు, వరదలు లిబియాను అతలాకుతలం చేస్తున్నాయి. 
 
లిబియాలోని టెర్నా, బేడా, సుసా ప్రాంతాలు తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా డ్యామ్‌లు పొంగిపొర్లడంతో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ తుఫాను, వరదల కారణంగా 2 వేల మందికి పైగా మరణించినట్లు సమాచారం. వేలాదిమంది గాయపడ్డారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైనారు. దీంతో లిబియా ప్రజల జీవనం మరింత కష్టతరంగా మారింది.