శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (11:47 IST)

రెండు నెలల శిశువు హలో అంది.. వీడియో

రెండు నెలల శిశువు అమ్మ హలో అంటే.. తాను కూడా హలో అంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా రెండు నెలల శిశువు తల్లి వద్ద పాలు తాగడం, కంటి నిండా నిద్రపోవడం చూసుంటాం. ఆరు నెలలైన తర

రెండు నెలల శిశువు అమ్మ హలో అంటే.. తాను కూడా హలో అంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా రెండు నెలల శిశువు తల్లి వద్ద పాలు తాగడం, కంటి నిండా నిద్రపోవడం చూసుంటాం. ఆరు నెలలైన తర్వాత ఏడాది వచ్చిన చిన్నారులు మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొంత మంది పిల్లలకు మాటలు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. 
 
అయితే ఈ వీడియోలో చిన్నారి మాత్రం తల్లి హలో అని పలకరిస్తే.. అందుకు హలో అంటూ స్పందించింది. ఆ చిన్నారి పేరు క్రిస్టియన్ జోన్స్ కాగా.. ఆమె తల్లి పేరు సమంత జోన్స్ అని వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ వీడియోను చూసినవారంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియోను సమంత జోన్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయ్యింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. ఈ వీడియోను ఇప్పటివరకు 540,823 మంది చూశారు.