శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 29 నవంబరు 2017 (19:44 IST)

అఖిల్ అక్కినేనికి షాకిచ్చిన యూ ట్యూబ్, అలా చేశాడనీ...

అఖిల్ అక్కినేని ఖాతాలో వున్న హలో మూవీ టీజర్‌ను యూ ట్యూబ్ తొలగించి ఆయనకు గట్టి షాకిచ్చింది. హలో టీజర్ తొలుత యూ ట్యూబులో పోస్టు చేశారు. కానీ మళ్లీ ట్విట్టర్లో కూడా జోడించడంతో కాపీ రైట్ ఉల్లంఘనకు అఖిల్ పాల్పడ్డారంటూ ఏకంగా హలో టీజర్‌‍ను యూ ట్యూబ్ నుంచి త

అఖిల్ అక్కినేని ఖాతాలో వున్న హలో మూవీ టీజర్‌ను యూ ట్యూబ్ తొలగించి ఆయనకు గట్టి షాకిచ్చింది. హలో టీజర్ తొలుత యూ ట్యూబులో పోస్టు చేశారు. కానీ మళ్లీ ట్విట్టర్లో కూడా జోడించడంతో కాపీ రైట్ ఉల్లంఘనకు అఖిల్ పాల్పడ్డారంటూ ఏకంగా హలో టీజర్‌‍ను యూ ట్యూబ్ నుంచి తొలగించారు. 
 
ఇటీవలి కాలంలో ఒకసారి ఎవరైనా ట్రెయిలర్ పోస్ట్ చేస్తే మరో వ్యక్తి కనుక మళ్లీ అదే ట్రెయిలర్ పోస్ట్ చేస్తే కాపీ రైట్ కిందకు వస్తుందంటూ తొలగిస్తోంది యూ ట్యూబ్. ఇప్పుడు అదే రీతిలో అఖిల్‌కు కూడా షాకిచ్చింది యూ ట్యూబ్. కాగా ఈ టీజర్‌ను అఖిల్ ఖాతా ద్వారా కాకుండా ఇతర ఖాతాల ద్వారా వీక్షిస్తున్నారు అఖిల్ అభిమానులు.