Daily Horoscope
✕

కంటిలో 20 నులిపురుగులు.. ఎలా వచ్చాయో తెలియదు..

Written By సెల్వి
Updated: గురువారం, 29 అక్టోబరు 2020 (13:39 IST)
ఈ మధ్య పొట్టలో పాములు, మేకులు వంటివి వైద్యులు వెలికి తీస్తున్న సంఘటనలు జరుగుతూనే వున్నాయి. తాజాగా చైనాలో ఒక వ్యక్తి కంటి నుంచి 20 నులిపురుగులను వైద్యులు బయటకు తీశారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వాన్‌ అనే వ్యక్తికి కంటి నొప్పి బాగా రావడంతో ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతనిని పరీక్షించిన వైద్యులు అతని కంటిలో నులిపురుగులు ఉన్నట్లు కనుగొన్నారు. మొదటిలో కంటినొప్పి వచ్చిందని, అయితే తాను అంతలా పట్టించుకోలేదని వాన్‌ తెలిపారు. తరువాత ఆ నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు.  
 
అప్పటికే అతని కంటిలో 20 నులిపురుగులు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు అతనికి చికిత్సనందించారు. సాధారణంగా ఇలాంటి  పురుగులు కుక్కలు, పిల్లులు కన్నీటిలో ఉంటాయి. అయితే వాన్‌ ఇంట్లోకానీ పని చేసే చోట కానీ ఏలాంటి  పెంపుడు జంతువులు లేవని వాన్‌ తెలిపారు. దీంతో అతని కంటిలోకి ఈ పురుగులు ఎలా చేరాయో తెలియరాలేదు.

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments