ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (14:07 IST)

పఠాన్‌కోట్ సూత్రధారి - భారత్ మోస్ట్ వాంటెడ్ పాక్ ఉగ్రవాది షాహిద్ హతం

shahid-latif
భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పఠాన్‌కోట్ ఉగ్రదాడికి సూత్రధారిగా ఉన్న షాహిద్‌ లతీఫ్ హతమయ్యాడు. పాకిస్థాన్ దేశంలోని సియోల్‌కోట్‌లోని ఓ మసీదులో గుర్తు తెలియని సాయుధ దండగులు ఆయన్ను కాల్చి చంపేశారు. ఉగ్రవాద జైష్ మొహ్మద్ సభ్యుడైన 41 యేళ్ళ షాహిద్... భారత్‌లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గత 1994 నవంబరు 12వ తేదీన ఉపా చట్టం కింద అరెస్టు అయి 16 యేళ్ళపాటు జీవితం గడిపాడు. 
 
2010లో వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ చేరాడు. 2016 జనవరి రెండో తేదీన పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక కీలక పాత్ర పోషించాడు. సియోల్ కోట్ నుంచే ఈ ఉగ్రదాడిని ఆయన పర్యవేక్షించిన షాహిద్.. ఇందుకోసం ఆయన నలుగురు ఉగ్రవాదులను చంపేశాడు. తాజాగా పాకిస్థాన్‌లోని సియోల్ కోట్‌లోనే దుండగుల చేతిలో హతమయ్యాడు.