గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (12:49 IST)

ఇజ్రాయెల్‌లో 44 సైనికులతో పాటు 700 మంది మృతి

Israel war
ఇజ్రాయేల్‌లపై హమాస్ యుద్ధం మూడో రోజుకు చేరుకుంది. ఇరువైపులా కలిపి ఇప్పటి వరకు 1,100 మంది చనిపోయినట్టు అంచనా. ఒక్క ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులు సహా 700 మందికిపైగా మృతి చెందారు.   
 
ఆదివారం ఓ మ్యూజిక్ ఫెస్ట్‌పై దాడిచేసి ఓ యువతి, ఆమె ప్రియుడిని కిడ్నాప్ చేసిన హమాస్ మిలిటెంట్లు.. మ్యూజిక్ ఫెస్ట్‌కు హాజరైన వారిని దారుణంగా కాల్చిచంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ హాలు నుంచి ఇప్పటి వరకు 260 మృతదేహాలను మెడికల్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. 
 
ఇంకోవైపు, హమాస్ ఇంకా తీవ్రంగానే విరుచుకుపడుతోంది. మిస్సైళ్లతో ఇజ్రాయెల్ నగరాలపై ఊపిరిసలపకుండా దాడులు చేస్తోంది.