గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (12:19 IST)

ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం.. 4శాతం పెరిగిన ఆయిల్ ధరలు

Oil Prices
Oil Prices
ఇజ్రాయెల్, పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడుల నేపథ్యంలో సోమవారం ఆయిల్ ధరలు 4 శాతం పెరిగాయి. 
 
బ్రెంట్ క్రూడాయిల్ ధరలు సోమవారం ఉదయం 4.7 శాతం పెరిగాయి. బ్యారెల్ 86.65 అమెరికన్ డాలర్లకు చేరగా.. టెక్సాస్ ఇంటర్మీడియెట్ 4.5  శాతం పెరిగి బ్యారెల్ 88.39 డాలర్లకు చేరింది. 
 
ఓవైపు ఆంక్షల కారణంగా రష్యా ఆయిల్ ఎగుమతులు తగ్గించుకుంది. అదే సమయంలో ఆయిల్ ఎగుమతులపై సౌదీ కూడా స్వీయ నియంత్రణ విధించుకుంది. 
 
తాజాగా జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇజ్రాయెల్, పాలస్తీనాల ఆయిల్ ఎగుమతులపై పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి.