బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (13:08 IST)

మణిపూర్‌లో హింస.. ముగ్గురు మృతి

manipur roits
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం జరిగిన తాజా హింసాత్మక ఘటనలో వృద్ధుడు, అతని కుమారుడు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.
 
అనుమానిత వ్యక్తులు క్వాక్తా లంఖై గ్రామంలో దాడి చేసి విచక్షణా రహితంగా ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో కొంతమందికి కూడా గాయాలయ్యాయి.
 
దుండగులు ఇద్దరు గ్రామస్తులను కూడా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. దాడి కారణంగా గ్రామంలోని మిగిలిన నివాసితులు పారిపోయారు. పోలీసులు అదనపు బందోబస్తుతో ప్రాంతాలకు చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
 
మృతులను యుమ్నం పిషక్ మైతేయి (67), అతని కుమారుడు యుమ్నం ప్రేమ్‌కుమార్ మైతేయి (39), పొరుగునే ఉన్న యుమ్నం జితేన్ మైతేయి (46)గా గుర్తించారు. 
 
కాగా, మణిపూర్‌లో దాదాపు 3 నెలలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.