శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (15:43 IST)

ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం.. 35కి పెరిగిన మృతుల సంఖ్య

Indonesia
కరోనా వైరస్, బర్డ్ ఫ్లూతో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. ఇండోనేషియాను భూకంపం కుదిపేసింది. ఇండోనేషియాలోని సులవేసి అనే ద్వీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో వందకు పైగా కట్టడాలు కూలిపోగా 35 మంది మృతి చెందారు, వందలాది మంది గాయపడ్డారు. అయితే ఈ భూకంపం తెల్లవారుజామున 1.30కి ప్రజలు మంచి నిద్రలో ఉండగా రావడంతో చాలా మంది కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుకపోయారు. దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 
 
ఈ భూ ప్రకంపనల కారణంగా మూడు కొండచరియలు విరిగిపడగా కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అలాగే కొన్ని వంతెనలు దెబ్బతిన్నాయి. ఇక ఇదే చోట గత గురువారం మధ్యాహ్నం కూడా 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఈ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. 2018లో కూడా ఇక్కడ 6.2 తీవ్రతతో భూకంపం రావడంతో సునామీ కూడా వచ్చి వేలాది మంది మృతి చెందారు.