శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (15:29 IST)

సియోల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవదహనం

నెల రోజుల క్రితం దక్షిణకొరియాలోని ఓ ఫిట్‌నెస్ క్లబ్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో 29మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే.. సియోల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41మంది సజీవదహనం అయ్యారు. వ

నెల రోజుల క్రితం దక్షిణకొరియాలోని ఓ ఫిట్‌నెస్ క్లబ్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో 29మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే.. సియోల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో 41మంది సజీవదహనం అయ్యారు. వివరాల్లోకి వెళితే దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని సెజాంగ్ ఆస్పత్రిలో ఈ ఘోరం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 70మందికి పైగా గాయాలకు గురైయ్యారు.
 
ఆస్పత్రిలోని మొదటి, రెండో అంతస్థుల్లో ఉన్న వారే అగ్నిప్రమాదంలో భారీగా గాయాలకు గురైనారని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఆస్పత్రి ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకోవడంతో సహాయక చర్యలకు కాస్త ఇబ్బంది ఏర్పడిందని.. అయినప్పటికీ గాయాల పాలైన వారిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారు ఎక్కువ మంది వుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.