శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (15:23 IST)

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం విఫలం.. ద.కొరియాతో చర్చలు?

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం విఫలమైంది. హ్వాసాంగ్-12 అనే మధ్యంతర క్షిపణి తన గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయిందని యూఎస్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ మేరకు డిప్లొమాట్ మేగజీన్ ప్రచురించిన కథనంలో.. గత ఏడాది

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం విఫలమైంది. హ్వాసాంగ్-12 అనే మధ్యంతర క్షిపణి తన గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయిందని యూఎస్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ మేరకు డిప్లొమాట్ మేగజీన్ ప్రచురించిన కథనంలో.. గత ఏడాది ఏప్రిల్ 28న ఈ క్షిపణిని ప్రయోగించడం జరిగిందని.. కానీ ఈ క్షిపణి ప్రయోగించిన నిమిషం తర్వాత ఫస్ట్ స్టేజ్ ఇంజన్లు విఫలమయ్యాయని తెలిపింది. 
 
గతి తప్పి ఆ దేశానికి చెందిన టోక్చోన్ అనే సిటీలో ఈ క్షిపణి కుప్పకూలిపోయింది. ఈ సిటీ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్‌కు 90 మైళ్ల దూరంలో ఉందని సదరు పత్రిక తెలిపింది. సిటీలోని జనాభా దాదాపు 2 లక్షలు కాగా... ఈ  ప్రయోగం విఫలం కావడంతో ఏర్పడిన ప్రాణనష్టాన్ని అంచనా వేయలేకపోయారు. 
 
ఈ మిస్సైల్ వల్ల నగరంలో ఉన్న పారిశ్రామిక కాంప్లెక్స్ లేదా వ్యవసాయ కాంప్లెక్స్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లిందని యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులను ఉటంకిస్తూ డిప్లొమాట్ మేగజీన్ కథనాన్ని ప్రచురించింది. 
 
ఇదిలా ఉంటే.. వ‌రుస‌గా క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తూ క‌ల‌క‌లం రేపుతోన్న ఉత్తర కొరియాపై ఆ దేశ ప‌క్క‌దేశం దక్షిణ కొరియా కారాలు మిరియాలు నూరుతోంది.  కొన్నిసార్లు ఉత్త‌ర‌కొరియా భూభాగానికి ద‌గ్గ‌ర‌లో ద‌క్షిణ కొరియా బాంబులు కూడా వేసి యుద్ధానికి స‌న్న‌ద్ధమవుతున్నట్లు హెచ్చ‌రికలు చేసింది. ఈ మ‌ధ్య ఇరు దేశాల మ‌ధ్య వాతావ‌ర‌ణం మ‌రింత ఉద్రిక్తంగా మారింది.
 
ఈ నేపథ్యంలో, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ప్రతినిధులు ఈ నెల 9న సమావేశం కానున్నారు. దాదాపు రెండేళ్ల త‌రువాత ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా ఉత్త‌ర‌కొరియాకు చ‌ర్చ‌ల కోసం ద‌క్షిణ‌కొరియా చేసిన విజ్ఞప్తికి ఉత్తర కొరియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.